మాబడి', 'పాఠశాల' పుస్తకాల కృ ష్ణమూర్తి ఇక లేరు

updated: March 2, 2018 13:49 IST
మాబడి', 'పాఠశాల' పుస్తకాల కృ ష్ణమూర్తి ఇక లేరు

మన తెలుగు విద్యార్దుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా పత్రికలు నెలకొల్పి,నిర్వహించటం వారు ఎవరున్నారు అంటే..నాయని కృష్ణమూర్తిగారు పేరు చెప్పాలి. మా బడి, పాఠశాల  మాస పత్రికలు నిర్వహించి విద్యార్థులకు కృష్ణమూర్తి మార్గదర్శిగా నిలిచారు.  ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ప్రముఖ కవి, సాహితీవేత్త, విజయవాణి  ప్రింటర్స్, విజయవాణి విద్యా సంస్థల అధినేత నాయని కృష్ణమూర్తి (67) మరణించారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన  బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 

చిత్తూరు జిల్లా నడిమిచెర్లలో 1951లో కృష్ణమూర్తి జన్మించారు. బాల్యం నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న నాయని తన 23 ఏళ్ల వయసులో యామినీ కుంతలాలు అనే నవల రాశారు.

ఈ నవలకు 1974 ఉగాది నవలల పోటీలో తృతీయ బహుమతి లభించింది. అనంతరం కొంతకాలం బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలకు ఉపసంపాదకులుగా పనిచేశారు. 

పిల్లల పత్రిక స్నేహబాలను నడిపించారు. సోదరులతో కలిసి మాబడి, పాఠశాల మాసపత్రికలను నిర్వహించారు. తద్వారా గ్రామీణప్రాంత విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడ్డారు. సాక్షరతా సమితి అకడమిక్‌ కమిటీ చైర్మన్‌గా పదిహేను సంవత్సరాలు పనిచేశారు. నిరంతర విద్యాకేంద్రాలకు వెలుగుబాట వారపత్రికను అందించారు.

అలాగే ..ఆయన తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ రాసారు. వాటిలో ఎక్కువగా పాపులరైంది..మహర్షి చిత్రంలోని 'సుమం  ప్రతి సుమం' . ఈ పాట ఆయనకు పాటల రచయితగా మంచి  పేరు తెచ్చిపెట్టింది. 

నాయని మరణవార్త తెలిసిన వెంటనే స్థానికులు, రచయితలు, కవులు, పలువురు నేతలు కన్నీటిపర్యంతమయ్యారు. కృష్ణమూర్తి పార్థివదేహానికి శుక్రవారం మధ్యాహ్నం 12:30కి  చౌడేపల్లిలోని విజయవాణి స్కూల్‌ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెలుగు 100 వారి మృతికి నివాళులు అర్పిస్తోంది.

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: nayani krishna murthy garu passes away

comments